రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు విశాఖపట్టణం జిల్లాలో ఏటీసీ టైర్ల కంపెనీని సీఎం గజగన ప్రారంభించారు.
విశాఖపట్టణం:మూడు ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లో ఏటీసీ టైర్ల పరిశ్రమను సీఎం జగన్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఏటీసీ ఫస్ట్ పేజ్ లో రూ. 1384 కోట్లతో యూనిట్ ను ఏర్పాటు చేసింది ఏటీసీ సంస్థ. రూ. 816 కోట్లతో రెండో దశ పనులకు ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 1002 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 250 ఎకరాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 4,664 మందికి ఉపాధి లభ్యం కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. తమ ప్రభుత్వం అందించిన సహకారంతో ఏటీసీ రెండో ఫేజ్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ప్రతి ఏటా రాష్ట్రం అవార్డులు అందుకుంటున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 17 భారీ పరిశ్రమల ద్వారా రూ. 39,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పారు. ప్రముఖ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాలేదన్నారు. కానీ రాష్ట్రంలో అదానీ గ్రూప్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.త్వరలోనే విశాఖలో అదానీ కంపెనీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుందని సీఎం వివరించారు.
undefined
రానున్న రెండేళ్లలో మరో 56 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఈకంపెనీలు రాష్ట్రంలో రూ. 1.54 లక్సల కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నాయన్నారు. అయితే దీని ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగాలు దక్కుతాయని జగన్ వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
మూతపడిన ఎంఎస్ఎంఈలను చేయూతనిస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఇందు కోసం రూ. 1463 కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం ప్రకటించారు రాష్ట్రంలో సుమారు లక్ష చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హర్బర్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఒక ప్రాంతం అభివృద్ది చెందాలంటే మెరుగైన ఉపాధి అవకాశాలు అవసరమన్నారు. అయితే రాష్ట్రంలో 75 శాతం మంది స్థానికులకే ఉపాధి కల్పించాలని చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం తమదని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.