ఏపీలో కొత్తగా 3,175 కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం... మరణాల్లోనూ భారీ తగ్గుదల

Siva Kodati |  
Published : Jul 04, 2021, 05:14 PM ISTUpdated : Jul 04, 2021, 05:15 PM IST
ఏపీలో కొత్తగా 3,175 కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం... మరణాల్లోనూ భారీ తగ్గుదల

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అదుపులోనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,175 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,00,028కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అదుపులోనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,175 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,00,028కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,844కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, ప్రకాశం 3,  తూర్పుగోదావరి 4, నెల్లూరు 1, చిత్తూరు 6, గుంటూరు 1, కర్నూలు 3, ప్రకాశం 3, కృష్ణ 6, విశాఖపట్నం 1, పశ్చిమగోదావరి 1, శ్రీకాకుళం 1, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,692 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,51,859కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 94,595 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,23,63,078కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 35,325 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 137, చిత్తూరు 473, తూర్పుగోదావరి 662, గుంటూరు 215, కడప 181, కృష్ణ 210, కర్నూలు 59, నెల్లూరు 235, ప్రకాశం 322, శ్రీకాకుళం 79, విశాఖపట్నం 142, విజయనగరం 62, పశ్చిమ గోదావరిలలో 398 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు