అవినీతికి, వివక్షకు తావులేకుండా వాలంటీర్ల వ్యవస్థ: నర్సరావుపేటలో జగన్

By narsimha lode  |  First Published Apr 7, 2022, 1:56 PM IST

రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు అవార్డులు ఇచ్చారు. ఈ సభలో విపక్షాలపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 


నర్సరావుపేట:వివక్ష, అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
పల్నాడు జిల్లాలోని Narasaraopet లో గురువారం నాడు  వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్  సన్మానించారు.ఉత్తమ వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు అందించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అవార్డులు అందించింది.సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేరుతో అవార్డులను ఇచ్చారు. 

 ఈ సందర్భంగా నిర్వహించిన సభలో YS Jagan ప్రసంగించారు.వాలంటీర్లు గొప్ప సేవకులు, గొప్ప సైనికులంటూ అభినందించారు.volunteer మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని జగన్ చెప్పారు.దేశం మొత్తం మనవైపు చూసేలా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నామన్నారు. . లబ్దిదారుల ఇంటికే  వాలంటీర్లు ప్రభుత్వం అందించే పథకాలను తీసుకెళ్తున్నారని సీఎం జగన్ చెప్పారు. 

Latest Videos

గత ఏడాది రూ. 226.7 కోట్లతో కలిపి రెండేళ్లలో రూ.465.99 కోట్ల నగదు పురస్కారాలను వాలంటీర్లకు అందిస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. పార్టీలు,ప్రాంతాలకు అతీతంగా కూడా ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా  ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టుగా CM చెప్పారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వ్యవస్థ తీసుకురావాలనేది తమ లక్ష్యమన్నారు.  ప్రభుత్వం తీసుకు వచ్చే ఏ పథకమైన పారదర్శకంగా  తమ ప్రభుత్వం అమలు చేస్తుందని జగన్ చెప్పారు.  సూర్యుడు ఉదయించకముందే పొద్దున్నే తలుపు తట్టి ప్రభుత్వం అందించే పథకాలను లబ్దిదారులకు అందిస్తున్నట్టుగా సీఎం గుర్తు చేశారు.సేవే పరమాధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారని సీఎం జగన్ చెప్పారు.లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలనే సంకల్పంతో వాలంటీర్ల వ్యవస్తను తీసుకొచ్చామన్నారు. 

click me!