గుంటూరు జిల్లా నరసరావుపేటలో హత్యకు గురైన అనూష కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు సీఎం జగన్. ఘటనకు సంబంధించి సీఎంవో అధికారులను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో సబ్ కలెక్టర్ ధర్నా స్థలికి వెళ్లారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో హత్యకు గురైన అనూష కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు సీఎం జగన్. ఘటనకు సంబంధించి సీఎంవో అధికారులను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు.
సీఎం ఆదేశాలతో సబ్ కలెక్టర్ ధర్నా స్థలికి వెళ్లారు. విద్యార్ధిని తల్లిదండ్రులకు పది లక్షల ఆర్ధిక సాయం అందించారు. జగన్ సూచనలతో నిందితుడిపై దిశా స్టేషన్‌లో కేసు పెడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు విద్యార్ధులు, అనూష కుటుంబసభ్యులు. దాదాపు 9 గంటల నుంచి వీరంతా నిరసన చేస్తున్నారు.
అంతకుముందు విద్యార్ధిని హత్యను నిరసిస్తూ స్థానికులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్ధులు రోడ్డెక్కారు. మృతదేహంతో పల్నాడు బస్టాండ్ వద్ద బైఠాయించారు. కాలేజీపైనా రాళ్లు రువ్వడంతో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
Also Read:నరసరావుపేట: యువతిని చంపిన ప్రేమోన్మాది.. మృతదేహంతో విద్యార్ధి సంఘాల ధర్నా
ప్రేమోన్మాదిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై విద్యార్ధి సంఘాల నేతలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ధర్నాలో విపక్షనేతలు సైతం పాల్గొన్నారు. పోలీసులు భారీగా మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది.
నర్సరావుపేట మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతిని కిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు. వినుకోండ ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి.. అనూష గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే యువతి మరో యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందనే అనుమానంతో ఆమెను హత్య చేశాడు విష్ణువర్థన్. తనకు దక్కని అమ్మాయి వేరేవరికి దక్కకూడదనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. నర్సరావుపేట మండలం పాలపేట వద్ద యువతి మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.