ఏపీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్తగా 94 మందికి పాజిటివ్, 8,89,503కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Feb 24, 2021, 08:59 PM IST
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్తగా 94 మందికి పాజిటివ్, 8,89,503కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గత కొద్దిరోజులుగా 50 నుంచి 70 మధ్యలోనే నమోదవుతున్న కేసులు ఇవాళ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 94 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,89,503కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఎలాంటి మరణం సంభవించలేదు. నిన్నటి వరకు రాష్ట్రంలో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,168కి చేరింది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 603 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 66 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,81,732కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు ఏపీలో 32,494 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,38,07,747కి చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం 11, చిత్తూరు 21, తూర్పుగోదావరి 8, గుంటూరు 8, కడప 5, కృష్ణ 4, కర్నూలు 2, నెల్లూరు 5, ప్రకాశం 0, శ్రీకాకుళం 9, విశాఖ 15, విజయనగరం 4, పశ్చిమ గోదావరిలలో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?