సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Published : Nov 01, 2019, 11:59 AM ISTUpdated : Nov 01, 2019, 12:06 PM IST
సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

సారాంశం

 ఆస్తుల కేసులో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయడంతో  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌


హైదరాబాద్: ఆస్తుల కేసులో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయడంతో  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌.

ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం నాడు హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకావడాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను హైద్రాబాద్‌ నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. వ్యక్తిగతంగా సీబీఐ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తరపున  న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

 ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపును ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు  శుక్రవారం నాడు కొట్టివేసిన విషయం తెలిసిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నందున ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి  మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.తన తరపున అడ్వకేట్ ఆశోక్‌రెడ్డి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని సీబీఐ కోర్టును సీఎం జగన్ కోరారు. 

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జగన్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 18న ఆస్తుల కేసులకు సంబంధించి అటు జగన్ తరపు న్యాయవాది, సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 

అదేరోజున 18న వాదనలు ముగియడంతో తుది తీర్పును నవంబర్ 1కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పాలనలో బిజీబిజీగా ఉండటంతో ప్రతీ శుక్రవారం తాను కోర్టుకు హాజరయ్యే అంశంపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

ప్రతి శుక్రవారం విచారణకు తన బదులు తన తరపు న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టుకు అప్పీల్ చేశారు.విజయవాడ నుంచి హైదరాబాద్​లోని కోర్టుకు హాజరు కావడానికి  ఖర్చు అవుతోందన్నారు.

రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కీలకమైన పథకాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో మినహాయింపు కోరుతున్నట్లు జగన్ తెలిపారు. 

అయితే ఈనెల 18న సీబీఐ కోర్టులో జరిగిన వాదనల్లో జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని సీబీఐ అభిప్రాయపడింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశ కూడ లేకపోలేదని సీబీఐ కోర్టులో తన వాదనలను విన్పించింది. అంతేకాదు   జగన్​కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వాదించింది. 

జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు.చట్టం ముందు అందరూ సమానులేనని ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోర్టు ముందు తన వాదనను విన్పించింది.

గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసినందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ముఖ్యమంత్రిగా జగన్ హోదా పెరగొచ్చుగానీ కేసులో ఎలాంటి మార్పులు ఉండవని ఆరోపించారు. 

ఇకపోతే సీఎం జగన్ తాను పాదయాత్ర సమయంలో హైకోర్టులో అప్పీల్ చేసిన విషయం వాస్తవమేనని జగన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే అది రాజకీయ పరమైన అంశం కావడంతో అందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 

తనపై విచారణ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు తాను సాక్షులను ప్రభావితం చేయలేదని, తనపై ఏమైనా ఆరోపణలు వచ్చాయా అని జగన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టే మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

YS Jagan: జగన్ కు సిబిఐ కోర్టు షాక్.. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే...

ఆరేళ్లలో ఏనాడైనా ఆరోపణలు వచ్చాయా....?: సీబీఐ కోర్టులో సీఎం జగన్

సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు  

ఆస్తుల కేసు: వైఎస్ జగన్ కోర్టు హాజరుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

PREV
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు