జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కూతురు సీతా మహాలక్ష్మి ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు సన్మానించారు.
అమరావతి:జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కూతురు సీతా మహాలక్ష్మి ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు సన్మానించారు.దేశా వ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జగన్ ఆమెను సన్మానించారు.
ఇవాళ ఉదయం తాడేపల్లి నుండి మాచర్లకు చేరుకొన్న సీఎం జగన్ పింగళి వెంకయ్య కూతురును సన్మానించారు. వారి కుటుంబ సభ్యుల గురించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు.సీతామహలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని సీఎం వాకబు చేశారు. సీతామహలక్ష్మి సీఎం జగన్ తో కొద్దిసేపు మాట్లాడారు. పింగళి వెంకయ్య నివాసంలో జాతీయ పతాకాన్ని కుటుంబసభ్యులు సీఎం జగన్ కు చూపారు. పింగళి వెంకయ్య కూతురు కుటుంబసభ్యులతో సీఎం జగన్ ఫోటో దిగారు.
స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేసుకొనేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారిని గుర్తు స్మరించుకొంటూ సన్మానిస్తున్నారు.
ఇందులో భాగంగానే పింగళి వెంకయ్య కూతురును సీఎం జగన్ ఇవాళ సన్మానించారు.