ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని యూటీఎఫ్ నాయకులు పట్టుకొన్నారు. డబ్బులు పంచుతూ దొరికినవారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని యూటీఎఫ్ నాయకులు పట్టుకొన్నారు. డబ్బులు పంచుతూ దొరికినవారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఏపీ రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారనే సమాచారం అందుకొన్న యూటీఎఫ్ నాయకులు అతడిని పట్టుకొన్నారు.
undefined
డబ్బులు పంచుతున్న వారిని యూటీఎఫ్ నాయకులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. డబ్బులు పంచుతూ పట్టుబడినవారిని చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో లబ్ది పొందేందుకుగాను డబ్బులుం పంచుతున్నారని యూటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ డబ్బులను పంచుతున్నారని యూటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు డబ్బులను ఎరగా చూపుతున్నారని యూటీఎప్ ఆరోపిస్గుంది.
డబ్బులు పంచుతున్నది ఎవరు.. ఎవరి కోసం డబ్బులు పంచుతున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.