వరద బాధితులకు రూ. 2వేల ఆర్ధిక సహాయం: ముంపు ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే

By narsimha lodeFirst Published Aug 18, 2020, 4:15 PM IST
Highlights

వరద బాధితులకు రూ. 2 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని ఏపీ  సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.వరద సమయంలో బాధితులకు సహాయం అందిస్తూనే అదనంగా రెండు వేలను ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు


అమరావతి: వరద బాధితులకు రూ. 2 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని ఏపీ  సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.వరద సమయంలో బాధితులకు సహాయం అందిస్తూనే అదనంగా రెండు వేలను ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు.నీరు, పరిశుభ్రత, ఆహారం, వసతులు ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

 

సీఎం జగన్ ఏరియల్ సర్వే.. pic.twitter.com/DoBlEc9I2i

— Asianetnews Telugu (@asianet_telugu)

మంగళవారం నాడు ఉదయం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. భద్రాచలంలో వరద తగ్గుముఖం పడుతోందన్నారు. ఇవాళ రాత్రికి 17 లక్షలకు వరద ఉండొచ్చని సీఎం చెప్పారు. బుధవారం నాటికి 14 లక్షలు, గురువారం నాటికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గే అవకాశం ఉందని సీఎం చెప్పారు. 

also read:గోదావరికి వరద: ఏపీ సీఎం జగన్ కి చంద్రబాబు లేఖ

పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.  ప్రతి పునరావాస కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని సీఎం సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత జగన్ వరద ప్రాంతాల్లో  ఏరియల్ సర్వే నిర్వహించారు. 

click me!