సినీ ఫక్కీలో దోపిడి: సైరన్ వేసుకుంటూ వచ్చి రూ.20 లక్షలతో పరార్

By Siva KodatiFirst Published Aug 18, 2020, 4:01 PM IST
Highlights

విశాఖపట్నంలో సినీఫక్కీలో దోపిడీ జరిగింది. పోలీసుల పేరు చెప్పి రూ. 20 లక్షలు దోపిడి చేశారు కేటుగాళ్లు. 

విశాఖపట్నంలో సినీఫక్కీలో దోపిడీ జరిగింది. పోలీసుల పేరు చెప్పి రూ. 20 లక్షలు దోపిడి చేశారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే.. మధురవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటేశ్వరరావు, బ్రోకర్ వెంకటేశ్వర్లు స్థలాన్ని పరిశీలిస్తుండగా సైరన్ మోగించుకుంటూ ఓ కారు వచ్చింది.

అందులోంచి దిగిన కొందరు తమను పోలీసులకు పరిచయం చేసుకుంటూ కోటేశ్వరరావు నుంచి 20 లక్షలు రూపాయలు తీసుకున్నారు. వచ్చింది నకిలీ పోలీసులని, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇటీవలే పొలం అమ్మగా రూ.50 లక్షలు నగదు వచ్చిందన్న కోటేశ్వరరావు.. 20 లక్షలతో ఫ్లాట్ కొనాలని బ్రోకర్‌కి చెప్పాడు. ఈ విషయం కేవలం బ్రోకర్‌కి, కోటేశ్వరరావుకి మాత్రమే తెలియడంతో బ్రోకర్ వెంకటేశ్వరరావుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!