24 గంటల్లో 1246 మందికి పాజిటివ్.. ఏపీలో 20,44,490కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 24, 2021, 06:29 PM IST
24 గంటల్లో 1246 మందికి పాజిటివ్.. ఏపీలో 20,44,490కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు నమోదవ్వగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,450 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,535 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,246 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,44,490కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,118కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, చిత్తూరు 2, నెల్లూరు , ప్రకాశం, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,450 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,13,942కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 55,323 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,79,80,792కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,535 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 13, చిత్తూరు 207, తూర్పుగోదావరి 167, గుంటూరు 117, కడప 93, కృష్ణ 138, కర్నూలు 13, నెల్లూరు 158, ప్రకాశం 128, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 62, విజయనగరం 13, పశ్చిమ గోదావరిలలో 123 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami