గుంటూరు: స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న పత్తి బేళ్లు

Siva Kodati |  
Published : Sep 24, 2021, 08:35 PM IST
గుంటూరు: స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న పత్తి బేళ్లు

సారాంశం

గుంటూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వంకాయలపాడులోని ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి.. క్షణాల్లో భవనాలన్నింటికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు

గుంటూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వంకాయలపాడులోని ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి.. క్షణాల్లో భవనాలన్నింటికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్పిన్నింగ్ మిల్లులో భారీగా పత్తి నిల్వలు వున్నట్లు యాజమాన్యం చెబుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వుంటాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది