జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. తన కులం, మతం గురించి చేసిన విమర్శలపై ఆయన స్పందించారు.
గుంటూరు: నా మతం మానవత్వం, నా కులం మాటకు కట్టుబడే కులం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు కడప జిల్లాలో చేసిన విమర్శలకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు.
గుంటూరులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ప్రారంభించారు. తనపై కొందరు ఇష్టమెచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విపక్ష నేతల విమర్శల గురించి ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు.
undefined
Also read:మారితే గౌరవిస్తా.. లేదంటే జగన్ రెడ్డి అనే పిలుస్తా: తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్
ఎన్నికల ముందు తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా జగన్ గుర్తు చేశారు. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విపక్షాలపై విమర్శలు గుప్పించారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్టుగా ఆయన చెప్పారు. తమ పాలనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Also read:జగన్ రెడ్డి అంటే తప్పేమిటి, నాకే కులం అంటగడుతారా: పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్
తన పాలన గురించి జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ మధ్యకాలంలో నా మతం గురించి, నా కులం గురించి మాట్లాడుతున్నారని ఆయన పరోక్షంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.ఇలాంటి మాటలను విన్న సమయంలో తనకు బాధ వేస్తోందని చెప్పారు.
ఎన్నికల ముందు పాదయాత్ర సందర‍్భంగా ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం. అందులో భాగంగా ఇచ్చిన మాటలో ఒకదాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు.
ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నామన్నారు. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు.
దానికి నాకు చాలా బాధ కలిగింది. నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా... నా కులం మాట నిలబెట్టుకునే కులం. వాళ్లు చేస్తున్న అవాకులు, చెవాకులు పక్కనపెడితే..ఇవాళ జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికాం. ఇందుకు నాకు సంతోషంతో పాటు గౌరవంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.