అత్యాచారం చేసి... తప్పించుకునేందుకు నిందితుడి మాస్టర్ ప్లాన్

Published : Dec 02, 2019, 11:03 AM ISTUpdated : Dec 02, 2019, 11:35 AM IST
అత్యాచారం చేసి... తప్పించుకునేందుకు నిందితుడి మాస్టర్ ప్లాన్

సారాంశం

జిల్లా వదిలేసి పరారైన పూజారి దేరంగుల రవి అలియాస్‌ సత్యనారాయణ(35) ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకున్నాడు. సొంత ఫోను వదిలేసి.. కనిపించినవారి ఫోన్లు తీసుకుని కుటుంబ సభ్యులు, ఇతరులతో మాట్లాడుతున్నాడు. 

గుడిలో పూజారిగా ఉంటూ స్వామివారికి పూజలు చేసేవాడు. భగవద్గీత నేర్పిస్తానంటూ ఓ గిరిజన బాలికపై కన్నేశాడు. ఎవరూ చూడకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 28వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా... గిరిజన బాలిక తన తల్లిదండ్రుల సహాయంతో కడప జిల్లా సుండుపల్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా... బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు  చేసుకున్న పోలీసులు..  నిందితుడు కోసం ఆనాటి నుంచి గాలిస్తూనే ఉన్నారు. కాగా... నిందితుడు మాత్రం దొరకలేదు. అయితే... పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు మాష్టర్ ప్లాన్ వేశాడు.

Alsoread ప్రేమ పెళ్లి... భార్యను అతికిరాతకంగా హత్య చేసి.......

జిల్లా వదిలేసి పరారైన పూజారి దేరంగుల రవి అలియాస్‌ సత్యనారాయణ(35) ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకున్నాడు. సొంత ఫోను వదిలేసి.. కనిపించినవారి ఫోన్లు తీసుకుని కుటుంబ సభ్యులు, ఇతరులతో మాట్లాడుతున్నాడు. 

అతడి ఇంటికి వచ్చే ఫోన్లపై నిఘా పెట్టిన సుండుపల్లె పోలీసులు.. కాల్‌ ట్రాకింగ్‌ ద్వారా అతడు తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని అన్నవరం ఎస్‌ఐ మురళీమోహన్‌కు చేరవేయడంతో, వారు నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు. 

శనివారం మధ్యాహ్నం నిందితుడు అన్నవరంలోని మెయిన్‌ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆదివారం సుండుపల్లె నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu