రాబోయే ఎన్నికల్లో తేల్చుకుందాం..: తనపై తెలంగాణలో జరిగిన దాడిపై అంబటి సీరియస్

By Arun Kumar P  |  First Published Oct 30, 2023, 1:20 PM IST

తెలంగాణలో తనపై జరిగిన దాాడిపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు.  ఇలా రోడ్లపై కాదు రాబోయే ఎన్నికల్లో చూసుకుందాం అంటూ హెచ్చరించారు. 


గుంటూరు : తెలంగాణకు వెళ్లిన తనపై కొందరు దాడికి యత్నించిన ఘటనపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఖమ్మంలో బంధువుల నిశ్చితార్థం వుంటే వెళ్లానని... ఈ క్రమంలోనే కొందరు తనపైకి దాడికి వచ్చారని మంత్రి తెలిపారు. ఒక్కసారిగా తనపైకి వచ్చి దుర్భాషలాడుతూ దాడి చేయాలని చూసారని... వంటనే తన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారని తెలిపారు. ఇలా తనపై దాడికి యత్నించిన వారిలో 9 మందిని పోలీసులు గుర్తించారని... ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ కూడా చేసారని అంబటి రాంబాబు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీకి చెందినవారే తనపై దాడికి యత్నించారని అంబటి ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతూ టిడిపి ఉగ్రవాదులను తయారు చేస్తోందని మంత్రి అన్నారు. తనపై దాడి చేస్తే భయపడిపోతానని అనుకున్నట్లున్నారు... ఈ బెదిరింపులకు భయపడబోనని అన్నారు. వీరిలా రౌడీయిజంతో కాదు రాబోయే ఎన్నికల్లో సత్తా ఏంటో చూపిస్తాననని అంబటి రాంబాబు హెచ్చరించారు. 

Latest Videos

బంధువుల శుభకార్యానికి వెళితే దాడిచేయడం సిగ్గుచేటని అంబటి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏదన్నా ఉంటే రాబోయే ఎన్నికల్లో తేల్చుకుందాం... ప్రజలను నమ్మించి గెలిచి చూపించాలన్నారు. అంతేకానీ ప్రజాప్రతినిధిని పట్టుకుని దాడికి యత్నించడం సరికాదని మంత్రి అన్నారు. 

Read More  అందరికీ తెలిసిందేగా ''రసికులం''..: అంబటిపై అయ్యన్నపాత్రుడు సెటైర్లు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ కిరాయి కోటిగాడు... చంద్రబాబు తప్ప ఎవరేం అయిపోయినా ఆయనకు పట్టదని అన్నారు. చివరకు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసినా పట్టించుకోడని తాజా ఘటనతో అర్థమయ్యిందని అన్నారు. కేవలం తన రాజకీయాల కోసమే పవన్ కాపులను వాడుకుంటున్నాడు... వారికోసం ఆయన చేసిందేమీ లేదని అంబటి అన్నారు.   

రాజకీయంగా 100 విమర్శలు చెయ్యండి...సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి ప్రచారం చేయండి... కానీ దాడులు చేయడం సరికాదన్నారు. ఇలా తన సామాజికవర్గానికి చెందిన నాయకులపై దాడులు జరుగుతున్నా పవన్ పట్టించుకోవడం లేదని అన్నారు. కిరాయి కోటిగాడు పవన్ తమవారిపై దాడి జరిగితే ముందుకు రాడని కాపు ప్రజలు గుర్తించాలని మంత్రి అంబటి తెలిపారు. 
 
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మాత్రమే కాదు ఇలాంటి చాలా కుంభకోణాలు టిడిపి హయాంలో జరిగాయని అంబటి ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై పక్కా ఆధారాలున్నాయని... అందువల్లే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలా అవినీతికి పాల్పడిన చంద్రబాబు కోసం లక్షలాదిమంది ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారని టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు... ఇది పచ్చి అబద్దమని అన్నారు. నారా లోకేష్ పిచ్చి ప్రేలాపణలు ఆపాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. 
 

click me!