ఎన్నికలకు సిద్ధంకండి.. రాష్ట్రానికి త్వరలో పీకే టీం: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 16, 2021, 7:02 PM IST
Highlights

ఇప్పటి నుంచే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతలకు సంకేతాలిచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నాటికి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తికానుంది. దీంతో నాటి నుంచి ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం వుంటుంది

ఇప్పటి నుంచే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతలకు సంకేతాలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో దీనిపై మంత్రులతో చర్చించినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఎన్నికల కోసం అందరూ రంగంలోకి దిగాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఎన్నికల కోసం రంగంలోకి పీకే టీమ్ వస్తుందని మంత్రులకు చెప్పినట్లుగా  సమాచారం.

వచ్చే ఏడాది మే నాటికి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తికానుంది. దీంతో నాటి నుంచి ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం వుంటుంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వుండేందుకు సిద్ధం కావాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. గడపకు గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జగన్ ఆదేశించినట్లుగా సమాచారం. ప్రస్తుత కేబినెట్‌లో 80 శాతం మందిని ఎన్నికల టీమ్ కోసం వినియోగించుకుంటానని జగన్ స్పష్టం చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 
 

click me!