చిత్తూరు, తూ.గోలలో తీవ్రత: ఏపీలో 20,31,891కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 16, 2021, 05:22 PM IST
చిత్తూరు, తూ.గోలలో తీవ్రత: ఏపీలో 20,31,891కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు నమోదవ్వగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,248 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,708 మంది చికిత్స పొందుతున్నారు    

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,367 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,31,891కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,044కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, ప్రకాశం 2, పశ్చిమ గోదావరి 2, చిత్తూరు 3, గుంటూరు 3, విశాఖపట్నం, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,248 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,03,139కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 61,178 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,75,36,639కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,708 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 20, చిత్తూరు 217, తూర్పుగోదావరి 288, గుంటూరు 101, కడప 108, కృష్ణ 155, కర్నూలు 3, నెల్లూరు 135, ప్రకాశం 141, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 55, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 126 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?