ఉగాదికే జగన్ కొత్త కేబినెట్: మార్చి 27న మంత్రుల రాజీనామా?

Published : Mar 15, 2022, 12:44 PM ISTUpdated : Mar 15, 2022, 12:57 PM IST
ఉగాదికే జగన్ కొత్త కేబినెట్: మార్చి 27న మంత్రుల రాజీనామా?

సారాంశం

ఈ ఏడాది ఉగాది రోజున కేబినెట్  పునర్వవ్యవస్థీకరణ  చేసేందుకు గాను జగన్ రంగం సిద్దం చేసుకొన్నారు. అదే రోజున కొత్త మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ను ఈ ఏడాది ఉగాది రోజున Cabinet reshuffle అవకాశం ఉంది. అదే రోజున కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. మంగళవారం నాడు YCP  శాసనసభపక్ష సమావేశంలో మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు సంబంధించి YS Jagan  దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఈ నెల 27వ తేదీన YS Jagan మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉగాది రోజున కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ కోసం మంత్రుల రాజీనామా చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఉన్నట్టుగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను కూడా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయా సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. కేబినెట్ పునర్వవ్వస్థీకరణలో కూడా ఐదు డిప్యూటీ సీఎంలను కొనసాగించనున్నారు. మరో వైపు మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. హోం మంత్రిగా సుచరితను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.

రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వవ్వయస్థీకరిస్తామని జగన్ గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మంత్రుల్లో పని తీరు ఆధారంగా కేబినెట్ లో మార్చులు చేర్పులు కొనసాగించనున్నారు. కొందరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోనున్నారు. 2024 లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సిద్దం చేయడం కోసం జగన్ సర్కార్ టీమ్ ను సిద్దం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగానే మంత్రి వర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు. మరో వైపు పార్టీ కోసం పనిచేసే వారికి కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. 

ఈ ఏడాది జూన్ మాసంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా రంగంలోకి దిగనుంది. దీంతో ఈ టీమ్ రంగంలోకి వచ్చే సయమానికి కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో పాటు పార్టీలో మార్పులు చేర్పులకు కూడా  చేయాలని జగన్ భావిస్తున్నారు.

గత వారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇవాళ జరిగే పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా తెలిపారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వస్తే మీరే మంత్రులు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని కొనసాగిస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. 

దాదాపు మూడేళ్ల తర్వాత వైసీప శాసనసభపక్ష సమావేశం ఇవాళ జరగనుంది.ఈ సమావేశంలో సీఎం జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు టీమ్ ను తయారు చేసుకొంటున్న జగన్ శాసనసభపక్ష సమావేశంలో  పార్టీ నేతలకు కీలక సూచనలు చేసే అవకాశం లేకపోలేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు గాను అన్ని పార్టీలను కలుపుకుపోతామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిన్ననే ప్రకటించారు.ఈ పరిణామాలపై కూడా వైసీపీ సీరియస్ గా తీసుకొంది. విపక్షాలు కూటమిగా పోటీ చేస్తే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడా వైసీపీ కేంద్రీకరించనుంది.

రెండున్నర ఏళ్లకు పైగా మంత్రివర్గంలో చోటు కోసం చూస్తున్న ప్రజా ప్రతినిధులు కూడా సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయనున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu
Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu