జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రత్యేక చర్చ విషయమై టీడీపీ సభ్యులు పదే పదే అంతరాయం కల్గిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక్క రోజు సభ నుండి సస్పెండ్ చేశారు.
అమరావతి: సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న TDP సభ్యులను ఇవాళ ఒక్క రోజు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tamminenis Sitaramప్రకటించారు.
బెందాళం. ఆశోక్, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప,గణబాబు, జోగేశ్వర్ వి. గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్,ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లను మంగళవారం నాడు ఒక్క రోజుకు సస్పెండ్ చేశారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై చర్చకు టీడీపీ పట్టుబడింది.ఇదే అంశంపై నిన్న కూడా అసెంబ్లీలో పట్టుబడిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.
undefined
జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని టీడీపీ నిన్నటి నుండి పట్టుబుడుతుంది. చర్చ కోరుతూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగుతున్నారు. దీంతో సభ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుండి సస్పెండ్ కావాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని వైసీపీ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు.
జంగారెడ్డి గూడెంలో ఇటీవల కాలంలో మరణించిన కుటుంబ సభ్యులను టీడీపీ చీఫ్ చంద్రబాబు సోమవారం నాడు పరామర్శించారు. ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారనే ప్రచారం కూడా లేకపోలేదు.
ఈ విషయమై ఏపీ అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ డిప్యూటీ సీెం ఆళ్ల నానిలు ప్రకటన చేశారు. సహజ మరనాలను కూడా టీడీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రభుత్వం మండిపడింది.
ఈ మరణాలపై దర్యాప్తు నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైమావతి విజయవాడ జీజీహెచ్ డాక్టర్ల టీమ్ జంగారెడ్డి గూడెంలో విచారణ నిర్వహించింది.. మృతుల కుటుంబాల ఇళ్లకు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి వివరాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఇందులో పలువురు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. మరి కొందరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నరని పేర్కొన్నారు.
ఈ మరణాల నేపథ్యంలో పలువురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఒకరు హాస్పిట్ లకు వెళ్లిన కొంత సమయానికి మృతి చెందారు. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదు. ఇలా మృతి చెందిన వారెవరికీ పోస్టు మార్టం నిర్వహించలేదు. దీంతో అసలు మరణాలు ఏ కారణంతో సంభవిస్తున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.