ఓటేయడానికి కదిలిన 90ఏళ్ల వృద్ధురాలికి... కృష్ణా జిల్లా కలెక్టర్ సాయం

By Arun Kumar PFirst Published Feb 17, 2021, 11:52 AM IST
Highlights

ఓటేయడానికి వచ్చిన తొంభయ్యేళ్ల వృద్ధురాలిని తానే స్వయంగా చేయిపట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి దగ్గరుండి ఓటు వేయించారు కృష్ణా జిల్లా కలెక్టర్.

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మూడో విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(బుధవారం) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్ సందర్శించారు. అయితె కలెక్టర్ సందర్శన సమయంలోనే  90సంవత్సరాల వృద్ధురాలయిన పాగోలు అన్నపూర్ణ ఓటేయడానికి ఒంటరిగా వచ్చింది. 

అయితే వృద్ధురాలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ఇబ్బంది పడటాన్ని కలెక్టర్ గమనించారు. దీంతో వెంటనే ఆమెవద్దకు వెళ్లి స్వయంగా తానే చేయిపట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి దగ్గరుండి ఓటు వేయించారు. ఆ తర్వాత ఆమెను బయటకు తీసుకువచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వృద్దురాలికి చేసింది చిన్నసాయమే అయినా ఆయన సేవాదృక్పదాన్ని చూసి అక్కడున్నవారు కొనియాడకుండా వుండలేకపోయారు. 

అవనిగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని, కౌంటింగ్ రూమ్ ను, పీడీ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం మరియు కౌంటింగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు .

click me!