గత 24 గంటల్లో ఏపీలో 1506 కరోనా కేసులు: మొత్తం మృతులు 13,647కి చేరిక

Published : Aug 15, 2021, 05:08 PM ISTUpdated : Aug 15, 2021, 05:09 PM IST
గత 24 గంటల్లో ఏపీలో 1506 కరోనా కేసులు: మొత్తం మృతులు 13,647కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1506 కొత్త కేసులు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గడం లేదు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను  పొడిగించింది. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో65,500 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1506  మందికి కరోనా నిర్ధారణ అయింది. 

దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,93,697 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,647కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1835మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 62వేల 185 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 17,865యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,56,61,449 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో023,చిత్తూరులో 217, తూర్పుగోదావరిలో319 గుంటూరులో162,కడపలో 027, కృష్ణాలో098, కర్నూల్ లో015, నెల్లూరులో181, ప్రకాశంలో 102,విశాఖపట్టణంలో 075, శ్రీకాకుళంలో045, విజయనగరంలో 072,పశ్చిమగోదావరిలో 170 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  16 మంది చనిపోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురి చొప్పున కరోనాతో చనిపోయారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు.నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,647కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,794, మరణాలు 1090
చిత్తూరు-2,35,088, మరణాలు1798
తూర్పుగోదావరి-2,82,708, మరణాలు 1240
గుంటూరు -1,70,655,మరణాలు 1166
కడప -1,11,633, మరణాలు 628
కృష్ణా -1,11,697,మరణాలు 1262
కర్నూల్ - 1,23,587,మరణాలు 844
నెల్లూరు -1,37,538,మరణాలు 981
ప్రకాశం -1,31,889, మరణాలు 1025
శ్రీకాకుళం-1,21,435, మరణాలు 772
విశాఖపట్టణం -1,53,773, మరణాలు 1097
విజయనగరం -81,848, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,72,157, మరణాలు 1075


 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu