డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్... ఆక్స్‌ఫర్డ్ నుండి..: సీఎం జగన్

By Arun Kumar PFirst Published Aug 7, 2020, 6:54 PM IST
Highlights

బ్రిటిష్‌ దౌత్యాధికారులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

అమరావతి: బ్రిటిష్‌ దౌత్యాధికారులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారత్‌లో బ్రిటిష్‌ తాత్కాలిక హై కమిషనర్‌ జాన్‌ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఈ వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు. కోవిడ్‌ నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై సీఎం జగన్ తో వీరు చర్చించారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ మాట్లాడుతూ... ఆక్స్‌ఫర్డ్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. బ్రిటన్‌ సహకారం తమ రాష్ట్రానికి చాలా అవసరమని... మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో కోవిడ్‌ టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నామని తెలిపారు. సగటున రోజుకు 62వేల వరకూ పరీక్షలు చేస్తున్నామని... 90శాతం పరీక్షలు కోవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నామన్నారు. దీనివల్ల కేసులు బాగా నమోదవుతున్నాయని సీఎం వివరించారు. . 

read more   యూకేలో కరోనా వ్యాక్సిన్... భారత్ లోనే ఉత్పత్తి: బ్రిటీష్ హైకమీషనర్

''కోవిడ్‌సోకిన వారిని వేగంగా గుర్తించి వారిని ఐసోలేట్‌ చేయడానికి, వైద్యం అదించడానికి తద్వారా మరణాలు రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నాం.  మరణాలు రేటు దేశం సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ.  మరణాల రేటు దేశంలో 2.07 శాతం వుంటే ఏపీలో 0.89 శాతంగా వుంది. నాణ్యమైన వైద్య సేవలను అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం'' అని తెలిపారు. 

''హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అన్ని రకాల పెద్ద ఆస్పత్రులు, వైద్య సేవలు అక్కడే అభివృద్ది చెందాయి. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేవు. మేం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే . ప్రస్తుతం ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధిచేస్తున్నాం.  16 కొత్త మెడికల్‌ కాలేజీలను, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం'' అని వెల్లడించారు. 

''గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్‌ నిర్మిస్తున్నాం.  ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటిల్, జిల్లా ఆస్పత్రి, బోధనాసుపత్రులను బాగా అభివృద్ధి చేయబోతున్నాం. జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం.  కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం దాంతో కలిసి బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి.  ఈలోగా మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం'' అని వివరించారు. 

''ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నందు వల్లే కోవిడ్‌ మరణాలు వస్తున్నాయి.  ఎంత త్వరగా వస్తే అంతగా మరణాలు తగ్గించవచ్చు. 10వేలకుపైగా రెమిడెసివర్‌ ఇంజక్షన్లు వాడి చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించాం. త్వరగా ఆస్పత్రికి రావడం అన్నది చాలా ముఖ్యం'' అని సీఎం జగన్ సూచించారు. 


 

click me!