సాగునీటి వివాదం: చిత్తూరులో ఇరువర్గాల మధ్య దాడి: ఇద్దరికి గాయాలు

By narsimha lodeFirst Published Oct 25, 2020, 11:24 AM IST
Highlights

 చిత్తూరు జిల్లాలో సాగు నీటి వివాదం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. నీటి కోసం దాయాదులు కొట్టుకొన్నారు.  సోదరుడి కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో సాగు నీటి వివాదం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. నీటి కోసం దాయాదులు కొట్టుకొన్నారు.  సోదరుడి కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జిల్లాలోని మదనపల్లి మండలం నాయినవారిపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.సాగు నీటి వివాదం కారణంగా పెదనాన్నను, ఆయన కొడుకుపై సోదరుడి కుటుంబం విచక్షణ రహితంగా దాడి చేసింది. ఈ దాడిలో పెదనాన్న ఆయన కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. 

సాగు నీటి విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ గొడవల నేపథ్యంలో పెదనాన్న కుటుంబంపై ప్రత్యర్ధి కుటుంబం దాడికి దిగింది.ఈ దాడిని ప్రత్యర్ధి వర్గం తిప్పికొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.ఈ  దాది డృశ్యాలను స్థానికులు మొబైల్ లో చిత్రీకరించారు.

వేటకొడవళ్లతో దాడికి దిగారు. ఈ దాడి దృశ్యాలను పక్కనే ఉన్నవారు మొబైల్ లో చిత్రీకరించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొబైల్స్ లో రికార్డు చేసిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 


 

click me!