కరోనాతో సహజీవనం చేయాల్సిందే: మరోసారి జగన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 13, 2021, 3:35 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూనే, కరోనాతో యుద్ధం చేయాలని సీఎం సూచించారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూనే, కరోనాతో యుద్ధం చేయాలని సీఎం సూచించారు.

మాస్క్‌‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని జగన్ కోరారు. వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తేనే క‌రోనాను పూర్తిగా నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. అయితే, భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ కోసం మొత్తం 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

Also Read:కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై ప్రత్యామ్నాయం ఆలోచించాలి: జగన్

ఇప్ప‌టివ‌ర‌కు 18 కోట్ల డోసుల‌ను మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగార‌ని జ‌గ‌న్ అన్నారు. అలాగే, ఏపీకి మొత్తం 7 కోట్ల డోసులు కావాల్సి ఉంద‌ని చెప్పారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 73 ల‌క్ష‌ల డోసుల‌ను మాత్ర‌మే ఇచ్చార‌ని వివ‌రించారు. భార‌త్‌లో సీరం, భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లు వ్యాక్సిన్లను త‌యారు చేస్తున్నాయ‌న్నారు.

భార‌త్ బ‌యోటెక్ నెల‌‌కు కోటి వ్యాక్సిన్లు త‌యారు చేస్తోంద‌ని, అలాగే, సీరం ఇన్‌స్టిట్యూట్ కు నెల‌కు 6 కోట్ల వ్యాక్సిన్ల త‌యారీ సామ‌ర్థ్యం ఉంటుంద‌ని తెలిపారు. అంటే దేశంలో నెల‌కు కేవ‌లం 7 కోట్ల వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం మాత్ర‌మే ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కాబ‌ట్టి దేశ ప్ర‌జ‌లు కరోనాతో స‌హ‌జీవ‌నం చేస్తూనే, మరోపక్క దానితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంద‌ని చెప్పారు. 

click me!