సంగం డెయిరీ సెక్రటరీ సందీప్‌ను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ

By narsimha lodeFirst Published May 13, 2021, 3:31 PM IST
Highlights

సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్ ను ఏసీబీ అధికారులు గురువారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.  ఇవాళ సంగం డెయిరీలో  ఏసీబీ అధికారులు  తనిఖీలు చేశారు.  కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌తో పాటు పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

గుంటూరు: సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్ ను ఏసీబీ అధికారులు గురువారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.  ఇవాళ సంగం డెయిరీలో  ఏసీబీ అధికారులు  తనిఖీలు చేశారు.  కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌తో పాటు పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకొన్నాయనే కారణంగా ఈ సంస్థ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మాజీ కోపరేటివ్ అధికారిని కూడ అరెస్ట్ చేశారు. సంగం డెయిరీని  ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొంది. అయితే ఈ జీవోను  సవాల్ చేస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు  హైకోర్టును  ఆశ్రయిస్తే ఈ జీవోను  ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. 

సంగం డెయిరీ వ్యవహరం ఏపీలో రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. డెయిరీ చైర్మెన్ గా ఉన్న దూళిపాళ్ల నరేంద్రను ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన దూళిపాళ్ల నరేంద్రకు కరోనా సోకడంతో ఆయనకు చికిత్స చేశారు. కరోనా నుండి కోలుకోవడంతో దూళిపాళ్ల నరేంద్రను అధికారుుల తిరిగి జైలుకు పంపారు. 

click me!