బెయిల్ రద్దు పిటిషన్: కౌంటర్ దాఖలు చేసిన జగన్, విచారణ ఈ నెల 14కి వాయిదా

By narsimha lode  |  First Published Jun 1, 2021, 11:48 AM IST

ఏపీ సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
 


హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు  సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. 98 పేజీల కౌంటర్ ను సీబీఐ కోర్టులో జగన్ తరపు న్యాయవాదలు దాఖలు చేశారు.  కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదని ఆ కౌంటర్ లో పేర్కొన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలో వాస్తవం లేదని కూడ ఈ కౌంటర్ లో జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. 

also read:ఇదే లాస్ట్ ఛాయిస్... జగన్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు

Latest Videos

సీఎంగా ఉన్న జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున కోర్టుకు హాజరుకాలేకపోయినట్టుగా న్యాయవాదులు తెలిపారు. విపత్తు సమయంలో ప్రభుత్వాధినేతగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ కౌంటర్ లో న్యాయవాదులు తెలిపారు. అయితే వ్యక్తిగత హాజరు నుండి జగన్ కు మినహాయింపును కోర్టు ఆమోదించింది. మినహాయింపును వేరే కోణంలో చూడొద్దని కూడ కోరారు. ఈ విషయమై సీబీఐ తరపు న్యాయవాదులు కూడ కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ విషయంలో కోర్టు నిర్ణయానికే వదిలేసిన సీబీఐ అధికారులు. పిటిషన్ మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరిన సీబీఐ తరపు న్యాయవాదులు.

ఈ కేసుతో పిటిషనర్ రఘురామకృష్ణంరాజుకు ఎలాంటి సంబంధం లేదని జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని వారు గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు పార్టీ  వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.రఘురామకృష్ణంరాజుపై ఏపీలో అనేక కేసులున్న విషయాన్ని ఆఫిడవిట్ లో జగన్ లాయర్లు చెప్పారు.  వ్యక్తిగత ప్రయోజనం కోసం కోర్టులను రఘురామకృష్ణంరాజు ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరి ఐఎఎస్ ల పేర్లను  ఈ పిటిషన్ లో పేర్కొనడంపై  జగన్ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 

click me!