ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, కొడుకు కరోనా బారినపడ్డారు. ఇటీవలనే కరోనా నుండి కోలుకొన్నారు. శ్రీకాకుళం ఆసుపత్రి నుండి కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
గత మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడ ఆయన పాల్గొన్నారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనారోగ్యానికి గురయ్యారు. జ్వరంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం ఆయనను మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. స్పీకర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల 12 వ తేదీన తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి, కొడుకు కరోనా నుండి కోలుకొన్నారు.
తమ్మినేని సతీమణికి తొలుత కరోనా సోకింది. ఆ తర్వాత సీతారాంకి ఆయన కొడుకు కరోనా సోకింది.కరోనా నుండి కోలుకొన్న తర్వాత ఆదివారం నుండి తమ్మినేని సీతారాం జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం నాడు చాలా రోజుల తర్వాత కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.