ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం: ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

By narsimha lode  |  First Published Oct 18, 2021, 6:15 PM IST


కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు  ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. మృతి చెందిన కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామాకాల కింద ఉద్యోగాలు కల్పించాలని  జగన్  ఆదేశించారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎంYs Jagan కీలక నిర్ణయం తీసుకొన్నారు. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామాకాల కింద Government Jobs కల్పించాలని  ఆదేశించారు.

Andhra pradesh రాష్ట్రంలోCorona కారణంగా సుమారు 14,307 మంది మరణించారు. అయితే ఇందులో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారో వారికి కారుణ్య నియామాకాల కింద ఉద్యోగాలు లభించనున్నాయి.

Latest Videos

undefined

also read:ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కరోనాపై సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు.ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ నాటికి కారుణ్య నియామాకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కరోనాను కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ ; ఉదయం పూట ఆంక్షలను విధించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేపట్టారు.మరోవైపు వైద్యఆరోగ్యశాఖలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు పనుల పురోగతిపై కూడా సీఎం చర్చించారు.

ఈ సమావేశంలోఉప ముఖ్యమంత్రి వైద్య,ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ ఆర్‌) శశి భూషణ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌పోర్స్ కమిటీ ఛైర్మన్‌ ఎం టి కృష్ణబాబు, 104 కాల్‌సెంటర్‌ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!