ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Oct 18, 2021, 05:05 PM ISTUpdated : Oct 18, 2021, 05:09 PM IST
ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిదికాదని’ వ్యాఖ్యానించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Ys Jagan పై తాడిపత్రి ఎమ్మెల్యే kethireddy pedda reddy వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ‘జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిదికాదని’ వ్యాఖ్యానించారు. 

Tadipatri నియోజక వర్గంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద Ysr Asara కార్యక్రమంలో మహిళలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రసంగించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

also read:బ్రేకింగ్ :వైసిపి నేత కేతిరెడ్డిపై కేసు: కక్షసాధింపేనా ?

మనిషిగా పుట్టాక అంతో.. ఇంతో సహాయం చేయాలని, అలాంటి గుణం లేనప్పుడు ఎవరి పరిధిలో వారుండాలన్నారు... రాజకీయ లబ్ధికోసం ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారని కేతిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారాయి. 

 అయితే ఎమ్మెల్యే నోరుజారి ఈ వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి  పెద్దారెడ్డి చెబుతున్నప్పటికీ అధికారపార్టీలో మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో  హాట్‌ టాపిక్ గా మారాయి. పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశారా.. లేదా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనే కోణంలో కూడ చర్చ సాగుతోంది.ఇటీవల కాలంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.

ఇటీవల కాలంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి చేసిన హంగామా ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు జిల్లాలో జేసీ సోదరులు మరోసారి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు దోహదం చేశాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో జేసీ సోదరుల ప్రభావం కన్పించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది


 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు