ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల భీమా: సీఎం జగన్

By narsimha lode  |  First Published May 26, 2020, 1:35 PM IST

ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల భీమాను అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రమాదవశాత్తు రైతులు మృతి చెందితే  ఆ కుటుంబానికి రూ. 7 లక్షలు చెల్లిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటికే 229 రైతు కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


అమరావతి: ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల భీమాను అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రమాదవశాత్తు రైతులు మృతి చెందితే  ఆ కుటుంబానికి రూ. 7 లక్షలు చెల్లిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటికే 229 రైతు కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మంగళవారం నాడు రాష్ట్రంలోని రైతులు, కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆయన మేథోమథనం నిర్వహించారు.

Latest Videos

undefined

ఈ ఏడాది మే నెలలో రైతులకు పెట్టుబడి కింద రూ. 7500 ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. అక్టోబర్ మాసంలో రూ. 4 వేలు చెల్లించనున్నట్టుగా ఆయన తెలిపారు. సున్నా వడ్డీతో పంట రుణాలు అందిస్తామన్నారు.

also read:ఏడాదిలో 90 శాతం హామీలు నెరవేర్చాం: ఏపీ సీఎం వైఎస్ జగన్

3,648 కి.మీ. పాదయాత్రలో రైతుల కష్టాలను తాను చూసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతుల కోసం రూ.10,290 కోట్లను ఖర్చు చేశామన్నారు. నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లకు రైతులకు భరోసా ఇచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

పంట సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు బాగుపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే వ్యవసాయానికి లాభసాటిగా ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నామన్నారు సీఎం జగన్. రూ. 1700 కోట్లతో ఫీడర్లను సమకూర్చున్నామన్నారు. 

కరోనా సమయంలో కూడ రైతులకు రూ. 1300 కోట్లు సహాయం చేసినట్టుగా సీఎం వివరించారు.రూ.1100 కోట్లతో పంటలను కొనుగోలు చేసినట్టుగా ఆయన తెలిపారు.ఆక్వా రైతుకు యూనిట్ విద్యుత్ ను రూపాయికే ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకొనేందుకు రూ.80 కోట్లను ఖర్చు చేశామన్నారు.

మార్కెట్ యార్డు చైర్మెన్ పదవుల్లో సామాజిక న్యాయం తెచ్చేందుకు ప్రయత్నించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చైర్మెన్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఈ పదవుల్లో 50 శాతం మహిళలే ఉండేలా చట్టం తెచ్చామన్నారు.

ఈ నెల 30న, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో 10641  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహాయం చేస్తామన్నారు.

click me!