నారాయణస్వామి వర్సెస్ రోజా: నగరిలో డిప్యూటీ సీఎం టూర్, ఫైర్ బ్రాండ్ ఫైర్

Published : May 26, 2020, 12:40 PM ISTUpdated : May 26, 2020, 12:44 PM IST
నారాయణస్వామి వర్సెస్ రోజా: నగరిలో డిప్యూటీ సీఎం టూర్, ఫైర్ బ్రాండ్ ఫైర్

సారాంశం

నగరి నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటించడంపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అందుబాటులో ఉన్నప్పటికి తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటించడంపై ఆమె మండిపడ్డారు.

నగరి: నగరి నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటించడంపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అందుబాటులో ఉన్నప్పటికి తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటించడంపై ఆమె మండిపడ్డారు.

జగన్ కేబినెట్ లో చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నారాయణస్వామికి జగన్ డిప్యూటీ సీఎం పదవిని కూడ కట్టబెట్టారు.

also read:రోజా సహా ఎమ్మెల్యేలకు షాక్: లాక్ డౌన్ ఉల్లంఘనలపై హైకోర్టు సీరియస్ కామెంట్

నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పుత్తూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కళ్యాణ మండపం ఏర్పాటుకు అవసరమైన స్థలం పరిశీలనకు గాను డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధికారులతో కలిసి వచ్చాడు. 

కళ్యాణ మండపం ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కూడ  పరిశీలించారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ఎందుకు తన నియోజకవర్గంలో పర్యటించారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

కొంత కాలంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, ఎమ్మెల్యే రోజాకు మధ్య విబేధాలు ఉన్నట్టుగా జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఇదే తరుణంలో రోజాకు చెప్పకుండా నారాయణస్వామి పర్యటించడం వీరి మధ్య మరింత అగాధాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పుత్తూరులో నారాయణస్వామి టూర్ పై రోజా అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు