ఆ నాలుగు జిల్లాల్లో ఎన్నికలకోడ్ ఎత్తేయండి: సీఈవోకు చంద్రబాబు లేఖ

By Nagaraju penumalaFirst Published May 1, 2019, 6:54 PM IST
Highlights

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లాలలో ఎన్నికల కోడ్ ఎత్తెయ్యాలని కోరారు. ఈ నాలుగు జిల్లాలలో హై అలెర్ట్ ఉన్న నేపథ్ంయలో తక్షణ చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కోడ్ మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు. 
 
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖరాశారు. ఫొని తుఫాన్ తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో ఆ తుఫాన్ ప్రభావమున్న నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్ మినహాయింపు ఇవ్వాలని లేఖ రాశారు. 

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లాలలో ఎన్నికల కోడ్ ఎత్తెయ్యాలని కోరారు. ఈ నాలుగు జిల్లాలలో హై అలెర్ట్ ఉన్న నేపథ్ంయలో తక్షణ చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కోడ్ మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు. 

ఎన్నికల కోడ్ మినహాయింపు ఇస్తే అధికారులు కాస్త స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతారని, మంత్రులు, తాము స్వయంగా పర్యవేక్షించుకోగలమని తెలిపారు. కోడ్ మినహాయింపు ఇస్తే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేతలు యుద్ధప్రాతిపదికన స్పందించేందుకు వీలు కలుగుతుందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు లేఖపై సిఈవో గోపాలకృష్ణ ద్వివేది ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.  

click me!