ఈ నెల 15నుంచి పవన్ బస్సు యాత్ర

Published : May 09, 2018, 02:26 PM IST
ఈ నెల 15నుంచి పవన్ బస్సు యాత్ర

సారాంశం

శ్రీకాకుళం నుంచి యాత్ర మొదలు

ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన తన ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ చుట్టివచ్చేలా యాత్ర ఏకబిగిన కొనసాగనుంది.  ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్ పూర్తి చేశారు.

యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ యాత్ర కోసం ఒక వావానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనంతోపాటు, యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమై, ఎక్కడ ముగించాలనేదీ పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేసినట్లు సమాచారం.  ప్రజల్లోకి వెళ్లడం.. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను గుర్తించడం.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా యాత్ర చేపడుతున్నారు.

 ప్రధాన సమస్యలున్న ప్రాంతాలకు వెళ్లినపుడు ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చేదీ వాటి పరిష్కారంలో పార్టీ విధానం ఏంటనేదీ అక్కడికక్కడే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ కమిటీల ఏర్పాటు కొనసాగుతున్నందున ఆయా జిల్లాల్లో వాటి పురోగతిపై పార్టీ ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu