అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్..10 వేల లోపు డిపాజిట్లను చెల్లించనున్న ప్రభుత్వం

By Siva KodatiFirst Published Feb 8, 2019, 7:31 AM IST
Highlights

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయించింది. 

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయించింది.

అగ్రిగోల్డ్ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను జప్తు చేసి వేలం వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున ముందుగా చిన్న మొత్తంలో పొదుపు చేసిన వారికి ఊరట కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

దీనిలో భాగంగానే రూ.10 వేల లోపు డిపాజిట్లు కట్టిన వారికి సొమ్ము చెల్లించనుంది. రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది నుంచి అగ్రిగోల్డ్ రూ.6,380 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించింది. ఇందులో ఒక్క ఏపీలోనే 10 లక్షల మంది డిపాజిటర్లు ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. 

click me!