రాజకీయ లబ్ధి కోసమే అఖిలపక్ష సమావేశానికి రాలేదు: గైర్హాజరైన పార్టీలపై చంద్రబాబు వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Jan 30, 2019, 7:27 PM IST
Highlights

రాజకీయలబ్ధి చూసుకుని భేటీకి కొన్ని పార్టీలు రాలేదేమోనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజాసంఘాలే గట్టిగా పోరాడాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. హోదాపై పార్టీ పరంగా చేయాల్సిన ఆందోళనలపై కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

అమరావతి: అఖిలపక్ష సమావేశానికి హాజరుకానీ పార్టీలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ కార్యచరణ కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయలబ్ధి చూసుకుని భేటీకి కొన్ని పార్టీలు రాలేదేమోనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర విభజన సమయంలో ప్రజాసంఘాలే గట్టిగా పోరాడాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. హోదాపై పార్టీ పరంగా చేయాల్సిన ఆందోళనలపై కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి బంద్‌కు సంఘీభావం తెలియజేయలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. 

కానీ అదే రోజు అసెంబ్లీలో చర్చించి బ్లాక్ డేగా పాటిస్తామన్నారు. ఢిల్లీలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని, దీక్షలో తాను, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని చంద్రబాబు సమావేశంలో వ్యాఖ్యానించారు.
 

click me!