పాదయాత్ర ముగింపు సభలో జగన్: నిరుద్యోగులను మోసం చేసిన బాబు

By Nagaraju TFirst Published Jan 9, 2019, 4:54 PM IST
Highlights

నిరుద్యోగ భృతి అనేది చంద్రబాబు ప్రారంభించిన ఓ పెద్ద డ్రామా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 

ఇచ్ఛాపురం: నిరుద్యోగ భృతి అనేది చంద్రబాబు ప్రారంభించిన ఓ పెద్ద డ్రామా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 

జాబు రావాలి అంటే బాబు రావాలి అని చంద్రబాబు ఎన్నికల సమయంలో తెగ ప్రచారం చేసుకున్నాడు కానీ ఇప్పుడు బాబు వస్తే ఉన్న జాబ్ ఊడిపోతుందని జగన్ ఆరోపించారు. 
ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని జగన్ ఆరోపించారు. 

యువతకు నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికలకు మూడు నెలలు ముందు కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 2.40 లక్షలు ఉద్యోగాలు ఉన్న ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చెయ్యరని విమర్శించారు. 

బాబు వచ్చాడు కానీ జాబు ఎక్కడ అని నిరుద్యోగి వెతుక్కోవాల్సిన పరిస్తితి నెలకొందన్నారు. అందువల్లే యువత నిన్ను నమ్మం బాబూ అంటూ విరుచుకుపడుతున్నారని జగన్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

 

click me!