నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు: ఏపీ సీఐడీ అసంతృప్తి

Published : Jun 07, 2021, 07:05 PM ISTUpdated : Jun 07, 2021, 07:07 PM IST
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు: ఏపీ సీఐడీ అసంతృప్తి

సారాంశం

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై ఏపీ సీఐడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రఘురామ తమకు చెప్పినదానికి ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై ఏపీ సీఐడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రఘురామ తమకు చెప్పినదానికి ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మొబైలో ఫోన్ అంశంలో రఘురామకృష్ణంరాజు దర్యాప్తు  సంస్థలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. గత నెల 15న రఘురామ మొబైల్‌  స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో ఉన్నది ఫలానా నెంబర్‌ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్‌మెంట్‌ నమోదు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తు చేశారు.  మొబైల్‌ ఫోన్‌ సీజ్‌ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపినట్టుగా చెప్పారు. రఘురామ యాపిల్‌ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించినట్టుగా తెలిపారు.  రఘురామ ఫోన్‌ డాటాను మే 31న కోర్టుకు అందించినట్టుగా సీఐడీ తెలిపింది.

also read:రఘురామకృష్ణంరాజు పోరు: జగన్ కు మినహా అన్ని రాష్ట్రాల సిఎంలకు లేఖలు

తన ఫోన్‌ సీజ్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించామని సీఐడీ తెలిపింది. తన నెంబర్‌ అంటూ అని ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్‌ నంబర్‌ ఇచ్చారన్నారు.  రఘురామకృష్ణంరాజు మే 15న మాకు చెప్పినదానికి ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందని చెప్పారు.దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని సీఐడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై Bhumana Karunakar Reddy Reaction | Asianet News Telugu
తిరుపతిలో మరోసారి భద్రతా లోపం: ఆలయ రాజగోపురం ఎక్కి రచ్చ చేసిన మందుబాబు