హైదరాబాద్‌లోని టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ, నోటీసులు

By Siva KodatiFirst Published Oct 1, 2022, 2:54 PM IST
Highlights

టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, చింతకాయల విజయ్‌కి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు

హైదరాబాద్‌లోని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. అయితే ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 41 సీఆర్పీసీ కింద విజయ్‌కి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా.. ఓ మార్ఫింగ్ వీడియోతో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు పలువురు టీడీపీ నేతలను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సెప్టెంబర్ 15న విచారణ జరిపిన న్యాయస్థానం గోరంట్ల కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సీఐడీని ఆదేశించింది. 

click me!