జల వివాదం సివిల్ వార్‌కు దారితీసే ఛాన్స్: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్

By narsimha lodeFirst Published Jul 6, 2021, 2:29 PM IST
Highlights

రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం సివిల్ వార్ కు దారితీసే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న  నది జలాల వివాదంపై  బీజేపీ ఎంపీ టీజీవెంకటేష్   మంగళవారం నాడు స్పందించారు. 


కర్నూల్: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం సివిల్ వార్ కు దారితీసే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న  నది జలాల వివాదంపై  బీజేపీ ఎంపీ టీజీవెంకటేష్   మంగళవారం నాడు స్పందించారు. కృష్ణానదిలో  నీటి పంపకాల ఒప్పందాలు కేసీఆర్ మర్చిపోతున్నారన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కేసీఆర్ కాదంటున్నారని ఆయన చెప్పారు.

also read:ఆ స్థలాన్ని సందర్శించండి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి తెలంగాణ

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అని తెలంగాణ నేతలు చెప్పడాన్ని ఆయన  ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టు నీటిని సాగు, తాగు నీరుగా ఎలా వాడుకొంటున్నారో చెప్పాలన్నారు.కేసీఆర్ కు ఏపీ నేతలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. హైద్రాబాద్ లో ఎన్నికలు వస్తే ఆంధ్రపాట పడుతారు కరీంనగర్ లో ఎన్నికలు వస్తే తెలంగాణ పాట పాడుతారన్నారు.రెండు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా జల వివాదం కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన నేతల మధ్య మాటల యద్దం సాగుతోంది.

 

click me!