ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబును వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (ఏపీ సీఐడీ) మంగళవారంనాడు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29 నుండి రాజకీయ పార్టీ సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనవచ్చని కూడ ఏపీ హైకోర్టు తెలిపింది. ఆరోగ్య కారణాలతో ఇదే కేసులో ఈ ఏడాది అక్టోబర్ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.ఈ నెల 28 వ తేదీతో మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. అయితే ఈ తరుణంలోనే నిన్ననే రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబుకు ఊరట లభించింది.
undefined
ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కాం కేసులో సాక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు సాక్ష్యాలను ప్రవేశపెట్టినట్టుగా ఏపీ సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. అయితే ఏపీ హైకోర్టు తమ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడ ఏపీ హైకోర్టు పాటించలేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసినట్టుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాకు చెప్పారు.
also read:chandrababu naidu: ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్, విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లోనే ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుండి ఈ ఏడాది అక్టోబర్ 31న విడుదలయ్యారు.
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత హైద్రాబాద్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హైద్రాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకన్నారు. ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు మెమో ద్వారా వివరాలు అందించారు.అయితే ఈ వివరాలను ఏసీబీ కోర్టుకు అందించాలని ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఆదేశించింది.
ఇదిలా ఉంటే ఈ నెల 28వ తేదీన రాజమండ్రి జైలుకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని సూచించింది. అంతేకాదు చంద్రబాబు వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను కూడ ఏసీబీ కోర్టుకు అందించాలని ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.