రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్

Published : Apr 30, 2023, 10:56 AM IST
 రాజమండ్రిలో  మాజీ ఎమ్మెల్సీ  ఆదిరెడ్డి అప్పారావు  అరెస్ట్

సారాంశం

చిట్‌ఫండ్  వ్యాపారం విషయమై  మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,  ఆయన  తనయుడు  ఆదిరెడ్డి వాసులను  సీఐడీ అధికారులు  అరెస్ట్  చేశారు. 


రాజమండ్రి: మాజీ ఎమ్మెల్సీ  ఆదిరెడ్డి అప్పారావు,  ఆయన  తనయుడు  ఆదిరెడ్డి వాసులను   సీఐడీ   అధికారులు  ఆదివారంనాడు  అరెస్ట్  చేశారు.  రాజమండ్రిలో  ఆదిరెడ్డి అప్పారావు  కుటుంబానికి  చిట్ ఫండ్ వ్యాపారాలున్నాయి.ఈ విషయమై సీఐడీ అధికారులు  అరెస్ట్  చేశారు. రాజమండ్రిలోని  తమ కార్యాలయంలో  ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు  వాసులను  సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.  రాజమండ్రి  ఎమ్మెల్యే  ఆదిరెడ్డి భవానీ   ఆదిరెడ్డి  అప్పారావు కోడలు.   ఆదిరెడ్డి అప్పారావు  కుుటంబం గతంలో  వైసీపీలో  ఉండేది.  ఆ తర్వాత  ఈ కుటుంబం  టీడీపీలో  చేరింది.  రాజమండ్రిలో  ఆదిరెడ్డి భవానీ  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu