మార్గదర్శి చిట్ ఫండ్స్ 37 బ్రాంచ్‌ల్లో ఏపీ సీఐడీ సోదాలు

Published : Apr 30, 2023, 02:37 AM IST
మార్గదర్శి చిట్ ఫండ్స్ 37 బ్రాంచ్‌ల్లో ఏపీ సీఐడీ సోదాలు

సారాంశం

Mangalagiri: మార్గదర్శి చిట్ ఫండ్ కు చెందిన 37 శాఖల్లో సీఐడీ సోదాలు నిర్వ‌హించింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మార్గదర్శినికి చెందిన 37 శాఖల్లో సీఐడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.   

CID conducts searches Margadarsi: మార్గదర్శికి చెందిన 37 శాఖల్లో సీఐడీ సోదాలు నిర్వ‌హించింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మార్గదర్శినికి చెందిన 37 శాఖల్లో సీఐడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్ర‌యివేటు లిమిటెడ్ (ఎంసీఎఫ్పీఎల్)కు చెందిన 37 శాఖల్లో ఆంధ్రప్రదేశ్ నేర దర్యాప్తు విభాగం (ఏపీ సీఐడీ) శనివారం సోదాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో భాగంగా మార్గదర్శికి చెందిన 37 శాఖల్లో ఆర్థిక రికార్డులు, డాక్యుమెంట్లను విస్తృతంగా తనిఖీ చేసేందుకు సీఐడీ బృందాలను నియమించినట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. 

మార్గదర్శిపై నమోదైన కేసుల దర్యాప్తు కొనసాగింపులో... ఏప్రిల్ 29 న, సీఐడీ ఎంసిఎఫ్పిఎల్ కు చెందిన 37 శాఖలలో తనిఖీలు నిర్వహిస్తోందని దాడుల‌కు ముందు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, డిపాజిటర్ల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, స్పెక్యులేటివ్ మార్కెట్లలోకి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లించడం వంటి అవకతవకలపై ఏపీ సీఐడీ గత నెలలో కంపెనీకి చెందిన పలు కార్యాలయాలపై దాడులు చేసింది.

కాగా, డిపాజిట‌ర్ల సొమ్ము మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపా­జిట్ల సేకరణ తదితర అభియోగాలతో A–1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీ­రావు, A–2గా చెరుకూరి శైలజా కిరణ్, A–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు ఇప్ప‌టికే న‌మోద‌య్యాయి. ఇటీవ‌లే వీరిని ఏపీ సీఐడీ అధికారులు ద‌ర్యాప్తులో భాగంగా వారిని విచార‌ణించారు. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ లోని ప‌లు మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్స్ కార్యాల‌యాల్లో సోదాలు చేశారు.  ప్ర‌స్తుతం ఏపీలోని మార్గ‌ద‌ర్శి కార్యాల‌యాల్లో దాడులు నిర్వ‌హిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు