
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సచివాలయంలోని అధికారులు సీఎస్ సమీర్ శర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో సమీర్ శర్మకు గుండె సంబంధిత చికిత్స జరిగింది. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి విధుల్లో చేరిన కొద్దిరోజులకే సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.