పోసాని కృష్ణ మురళికి సీఎం జగన్ గుడ్ న్యూస్.. కీలక పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు..

Published : Nov 03, 2022, 02:48 PM ISTUpdated : Nov 03, 2022, 02:53 PM IST
పోసాని కృష్ణ మురళికి సీఎం జగన్ గుడ్ న్యూస్.. కీలక పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు..

సారాంశం

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. పోసాని కృష్ణ మురళిని ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. 

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. పోసాని కృష్ణ మురళిని ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల మరో నటుడు అలీని ఏపీ ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలీ, పోసాని కృష్ణ మురళీ ఇద్దరు కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు.

పోసాని చాలా కాలంగా వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తుండగా.. అలీ 2019 ఎన్నికలకు ముందు పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి వీరి పదవుల విషయంలో ఎప్పుడూ చర్చ సాగుతూనే వస్తుంది. అయితే ఎట్టకేలకు దాదాపు మూడున్నరేళ్ల తర్వాత వీరికి సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరికి పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu