చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎల్వీ సుబ్రమణ్యం మెలిక

By narsimha lodeFirst Published May 7, 2019, 2:13 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్వహణపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మెలిక పెట్టారు. ఈ కేబినెట్ సమావేశంలో ఎజెండా ఆధారంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు విషయమై ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.


అమరావతి: ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్వహణపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మెలిక పెట్టారు. ఈ కేబినెట్ సమావేశంలో ఎజెండా ఆధారంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు విషయమై ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి   గోపాలకృష్ణ ద్వివేదితో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు సీఎంఓ నుండి ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యానికి ఇవాళే నోట్ కూడ చేరింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో  సమావేశమయ్యారు. కేబినేట్ భేటీ గురించి చర్చించారు.

కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాల ఎజెండా గురించి ఏపీ సీఎస్ సుబ్రమణ్యం  సీఎంఓను సమాచారం అడిగారు. కేబినేట్ ఎజెండాలో చేర్చే అంశాలను ఈసీకి నివేదించాల్సిన అవసరం ఉన్నందున వివరాలను కావాలని సీఎస్ అడిగినట్టు అధికారులు తెలిపారు.

ఏపీ కేబినెట్  ఎజెండాను ఈసీకి పంపి అనుమతిని తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎస్ చెప్పారు.  ఎన్నికల కోడ్ సమయంలో కేబినెట్ సమావేశం పెట్టకూడదని లేదని... కేబినెట్ సమావేశంలో ఎజెండానే కీలకంగా మారనుందని సీఎస్ అభిప్రాయపడుతున్నారు.

ఎజెండాలో అంశాలను ఆయా శాఖల నుండి సమాచారాన్ని తీసుకోనున్నట్టుగా ఎల్వీ సుబ్రమణ్యం సీఎంఓ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై ఈసీ నుండి అనుమతి వస్తేనే కేబినెట్ సమావేశానికి ఎలాంటి ఆటంకం ఉండదు. కేబినెట్ ఎజెండాపై  సంతృప్తి చెందితేనే  ఈసీ అనుమతి ఇవ్వనుంది. ఎజెండాలో చేర్చే అంశాలపై స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేస్తోంది. ఈ స్క్రీనింగ్ కమిటీకి సీఎస్ నేతృత్వం వహించనున్నారు.

ఈ కమిటీ ఫైనల్ చేసిన ఎజెండాను ఈసీ అనుమతి కోసం పంపనున్నారు. 

సంబంధిత వార్తలు

కేబినెట్ భేటీ: సాధారణంగా అయితే చంద్రబాబుదే నిర్ణయం, కానీ..

కేబినేట్ : అధికారులతో సీఎస్ అత్యవసర భేటీ

చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ

క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?

click me!