బాబుతో ముగిసిన ఎల్వీ భేటీ: అధికారులతో రివ్యూకు ఏర్పాట్లు

By narsimha lodeFirst Published May 13, 2019, 12:29 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం భేటీ ముగిసింది. కేబినెట్‌ ఎజెండాకు సంబంధించిన విషయమై ఈసీ నుండి ఇంకా అనుమతి రాలేదు.
 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం భేటీ ముగిసింది. కేబినెట్‌ ఎజెండాకు సంబంధించిన విషయమై ఈసీ నుండి ఇంకా అనుమతి రాలేదు.

సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో  ఏపీ సీఎస్‌గా ఉన్న పునేఠ స్థానంలో  ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే.

ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని చంద్రబాబునాయుడు భావించారు.ఈ మేరకు కేబినెట్ నిర్వహణకు సంబంధించి ఎజెండాను ఈసీ అనుమతి కోసం పంపారు. 

రెండు రోజుల క్రితం ఈసీ అనుమతి కోసం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఎజెండాను ఈసీ అనుమతి కోసం పంపారు. కానీ  ఇంతవరకు అనుమతి రాలేదు. ఈ విషయమై ఇవాళ సాయంత్రం వరకు ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.

కేబినెట్ నిర్వహణకు సంబంధించి ఈసీ నుండి అనుమతి రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడ సీఎస్‌ ఏపీ సీఎంతో చర్చించారు.ఒకవేళ కేబినెట్ భేటీకి సంబంధించి ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఫణి తుఫాన్, కరువు, తాగునీటి సమస్య తదితర సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

ఆసక్తికరం:చంద్రబాబుతో తొలిసారి సీఎస్ ఎల్వీ భేటీ

ఇంకా రాని ఈసీ అనుమతి: చంద్రబాబు కేబినెట్ భేటీపై సస్పెన్స్

 

click me!