ఐపీఎస్ సునీల్ ‌పై చర్యలకు కేంద్రం లేఖ: డీజీపీకి పంపిన సీఎస్

By narsimha lode  |  First Published Feb 26, 2023, 9:50 AM IST

సీనియర్ ఐపీఎస్  అధికారి  సునీల్‌కుమార్‌‌కు షాక్: చర్యలకు  హోంశాఖ లేఖ
 


అమరావతి: సీనియర్ ఐపీఎస్  అధికారి సునీల్ కుమార్ పై  చర్యలకు  ఆదేశాలిస్తూ  కేంద్ర హోంశాఖ లేఖ పంపింది. ఈ  లేఖను ఏపీ సీఎస్  జవహర్ రెడ్డి  రాష్ట్ర డీజీపికి  పంపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్  ఏపీ సీఐడీ డీజీగా  గతంలో  పనిచేశారు. ఇటీవలనే ఆయనను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.  సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని  కోరుతూ హైకోర్టు లాయర్ లక్ష్మీనారాయణ  కేంద్ర హోంశాఖకు  ఫిర్యాదు  చేశాడు.  అక్రమ కేసులు, సుప్రీంకోర్టు తీర్పుల ఉల్లంఘనల వంంటి అంశాలను  ఈ ఫిర్యాదులో  లాయర్  లక్ష్మీనారాయణ  ప్రస్తావించారు. 

ఈ ఫిర్యాదులపై  ఈ నెల 3వ తేదీన  ఏపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  జవహర్ రెడ్డికి  కేంద్ర హోంశాఖ నుండి  లేఖ అందింది.  సీనియర్ ఐపీఎస్ అధికారులపై  చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.  అంతేకాదు  యాక్షన్ టేకెన్ రిపోర్టును ఇవ్వాలని కూడా ఆ లేఖలో కోరిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం తెలిపింది.

Latest Videos

undefined

also read:ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ: కొత్త డీజీగా సంజయ్ నియామకం

ఏపీ సీఐడీ  చీఫ్ గా  ఉన్న సునీల్ కుమార్ ను  రాష్ట్ర ప్రభుత్వం  ఈ ఏడాది జనవరి 23వ తేదీన  బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్  కూడా ఇవ్వలేదు.  ఏపీ సీఐడీ  చీఫ్ గా  సంజయ్ ను నియమించింది.  ఫైర్ సర్వీసెస్ డీజీగా  ఉన్న సంజయ్  కు  సీఐడీ బాధ్యతలను అప్పగించింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఆకస్మికంగా తప్పించడం చర్చకు దారి తీసింది.  సునీల్  కుమార్ తీరుపై గతంలో టీడీపీ పలు విమర్శలు  చేసిన విషయం తెలిసిందే.  ఉద్దేశ్యపూర్వకంగా  టీడీపీ నేతలపై  సీఐడీ  పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా ఆ పార్టీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  

tags
click me!