ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌: రెండు రోజులు బిజీ బిజీ

Published : Jun 14, 2019, 03:00 PM IST
ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌: రెండు రోజులు బిజీ బిజీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో  జగన్ భేటీ కానున్నారు.  


అమరావతి:ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో  జగన్ భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను  పరిష్కరించుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రితో అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. 

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్నవిభజన సమస్యలపై చర్చించనున్నారు.రేపు న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.  నీతి ఆయోగ్ సమావేశం తర్వాత  వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొంటారుపార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు జగన్ దిశానిర్ధేశం చేస్తారు. 


 

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!