ఏపీలో ఐటీ దాడులపై చంద్రబాబు చర్చలు: ఏం చేద్దాం?

Published : Oct 05, 2018, 03:34 PM ISTUpdated : Oct 05, 2018, 03:35 PM IST
ఏపీలో ఐటీ దాడులపై చంద్రబాబు చర్చలు: ఏం చేద్దాం?

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు, రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఐటీ దాడులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు  మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు అమరావతిలో  సమావేశమయ్యారు.  

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు, రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఐటీ దాడులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు  మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు అమరావతిలో  సమావేశమయ్యారు.

కేబినెట్ భేటీకి  ముందే  మంత్రులతో చంద్రబాబునాయుడు  సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఏపీలో  శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయి. వైసీపీ నుండి గెలిచి... టీడీపీలో చేరిన పోతుల రామారావు‌తో పాటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కు చెందిన సంస్థలపై కూడ  ఐటీ దాడులు జరిగాయి.

మిగిలిన  సంస్థలపై కూడ ఏపీలో ఐటీ దాడులు చోటు చేసుకొన్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో  మంత్రులతో బాబు చర్చించారు.కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు అధికారులు ఉంటారు. రాజకీయ అంశాలు చర్చించే అవకాశం ఉండదు. దీంతో కేబినేట్ భేటీకి ముందే  చంద్రబాబునాయుడు మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. 

రానున్న రోజుల్లో ఇంకా ఐటీ దాడులు చోటు చేసుకొంటాయా... ఈ దాడుల వెనుక రాజకీయ పరమైన కుట్రలు ఏమైనా దాగున్నాయా.... సాధారణ పరిస్థితుల్లోనే  ఈ దాడులు జరిగాయా  అనే విషయమై కూడ చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే  రెండు రోజులుగా తెలంగాణ లో జరిగిన ఎన్నికల సభల్లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తనపై చేసిన విమర్శలపై కూడ చంద్రబాబునాయడు  మంత్రులతో చర్చించనున్నారు.  ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో  ఎలా వ్యవహరించాలనే దానిపై  మంత్రులతో బాబు చర్చించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

ఏపీలో తమిళనాడు సీన్ రిపీట్ అవుతోంది.. మంత్రి నారాయణ

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

ఐటీ అధికారుల చేతిలో.. ఓ మంత్రికి చెందిన ఫైల్..?

ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం బీజేపీకి అలవాటే..చంద్రబాబు

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్