జగన్ కి ఊరట... మూడు రాజధానులపై కేంద్రం వైఖరి ఇదే..

By telugu team  |  First Published Feb 4, 2020, 2:30 PM IST

మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సైతం అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆందోళణలు  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి లోక్ సభలో రాజధాని తరలింపు అంశాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని మద్దతు లభించింది. రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయైనా రాష్ట్రాలే తీసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం లోక్ సభ సమావేశాలు జరుగుతుండగా ఆ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతి ఉండేది. కాగా... దానిని మారుస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కూడా.. ఈ మేరకు కార్యాలయాల తరలింపు పనులు కూడా ప్రారంభించారు. ఈ మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. 

Latest Videos

undefined

Also Read ఆఫీసుల తరలింపు: వైఎస్ జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.

మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సైతం అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆందోళణలు  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి లోక్ సభలో రాజధాని తరలింపు అంశాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు. ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించగా... కేంద్రం సంచలన ప్రకటన చేసింది.

రాజధాని అమరావతి అని ప్రకటిస్తూ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015లో అమరావతిని ఏపనీ రాజధానిగా నోటిఫై చేశామని కేంద్రం చెప్పింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని తాము మీడియా రిపోర్టులో చూశామని కేంద్ర మంత్రి చెప్పారు. రాజధాని నిర్ణయం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పారు. 
 

click me!